Sunday, May 19, 2024
- Advertisement -

డిఫరేంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు!

- Advertisement -

తెలుగు హీరోలకు తెలుగులోనే కాకుండా ప్రపంచ మొత్తం మంచి పేరు ఉంది. అయితే తెలుగులో మాత్రం మన హీరోలు రోటిన్ స్టోరిలతో ఎలాంటి లాజీక్స్ లేకుండా 6 పాటలు… 5 ఫైట్లు…. ఫారిన్ లొకేషన్లు ఉండేలా సినిమాలు తీస్తున్నారు మన హీరోలు. మూస కథలతో సినిమాలు తీస్తున్నారు అని మంచి పేరు తెచ్చుకుంది టాలీవుడ్.

కానీ ఈ పాత వాసనలు, పాత చింతకాయ కథల నుంచి తెలుగు హీరో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాడు. కత్తిపట్టడాలు, సుమో ఛేజింగ్ ల లాంటి సీన్లను దాటుకొని బ్రెయిన్ ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఈమధ్య కాలంలో మన తెలుగు స్టార్లు ఎంచుకున్న కథలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 

ఈ మధ్యకాలంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకేక్కిన చిత్రణ్ నాన్నకు ప్రేమతో. ఈ సినిమా చేసినప్పుడే టాలీవుడ్ ట్రెండ్ మారిపోయిందనే విషయాన్ని అంతా ఫిక్స్ అయ్యారు. మాస్ మసాలాలు, యాక్షన్ కథలకు పెట్టింది పేరైన ఎన్టీఆర్… నాన్నకు ప్రేమతో లాంటి డిఫరెంట్ సినిమాలో కనిపించడమే పెద్ద సాహసం అని చెప్పాలి. ఈ ట్రెండ్ ను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని తారక్ భావిస్తున్నాడు. అటు మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త కొత్త కథలకు ఓటేసే హీరో అనే చెప్పాలి. నాని, యువరాజు లాంటి సినిమాల్ని కెరీర్ స్టార్టింగ్ లోనే చేశాడంటే అది మహేష్ డేరింగ్ కు ఎగ్జాంపుల్.

ఈమధ్యే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి కుటుంబకథాచిత్రం చేసిన మహేష్… అస్సలు ఫైట్లు లేని బ్రహ్మోత్సవం అనే మరో సినిమా చేస్తున్నాడు. మహేష్, ఎన్టీఆర్ తో పాటు చెర్రీ కూడా మారిపోయాడు. మాస్ కథలు ఇష్టపడే చెర్రీ… సుకుమార్ చెప్పిన ఓ స్టోరీకి ఓకే చేశాడు. అటు బన్నీ కూడా విక్రమ్ కుమార్, లింగుస్వామి లాంటి విలక్షణ దర్శకులతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు నాగార్జున లాంటి హీరోలు ఎప్పట్లానే తన ప్రయాణాన్ని విలక్షణంగా కొనసాగిస్తున్నారు. అయిన మూస కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు అదరిస్తాలేరు అనే విషయాన్ని మన హీరోలు కనిపెట్టేశారు. అందుకే సినిమా తీయడం కాదు అందులో మంచి విషయం ఉండేలా చూసుకుంటున్నారు. మూస కథలతో సినిమాలు తీయడం వల్ల ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అందుకే కొత్త స్టోరిలతో డిఫరేంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -