Sunday, May 5, 2024
- Advertisement -

సుమంత్ సినిమా ఇదం జ‌గ‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న వైఎస్ జ‌గ‌న్‌..

- Advertisement -

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా టీజర్ ను రేపు వైసీపీ అధినేత జగన్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహించగా… జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -