Friday, May 24, 2024
- Advertisement -

చంద్రబాబు’పెళ్లిళ్లపై’ జగన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

- Advertisement -

విశాఖ‌ప‌ట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా కోటరవుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని సైతం అమలు చెయ్యలేదని దుయ్యబుట్టావరు.

సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్‌తో పెళ్లికి సిద్దమయ్యారని జ‌న‌గ్ సెటైర్లు వేశారు. 2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బాయ్ కాట్ చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు తిరిగేసరికి అదే కాంగ్రెస్ తో జతకడుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన వ్యక్తికి నిస్సుగ్గుగా మద్దతు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో రాయబారం కోసం తన కుటుంబ సభ్యులను పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఐదు పార్టీలతో పెళ్లిళ్లు అయ్యాయని ఇప్పుడో ఆరోపెళ్లికోసం ఆరాట పడుతున్నారన్నారు.

బీజేపీని పెళ్లి చేసుకుని వదిలేశారని అలాగే టీఆర్ఎస్ మరియు సీపీఐ, సీపీఎంలను పెళ్లి చేసుకుని వదిలేశాడని ఎద్దేవా చేశారు. అలాగే జనసేన పార్టీని కూడా పెళ్లి చేసుకుని వదిలేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు….ఇలా పార్టీలు మార్చడం చూస్తుంటే అవకాశ వాద రాజకీయాలకు పెట్టింది పేరుగా చంద్రబాబు నాయుడును చెప్పుకోవచ్చునని అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -