Friday, May 17, 2024
- Advertisement -

ఇదిగో రాజ‌న్నా .. మమ్మూటీ దించేశాడుగా

- Advertisement -

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఈ ఒక్క పేరు తెలుగు రాష్టా రాజ‌కీయ‌ల‌లో ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో మ‌నంద‌రికి తెలిసిందే.జ‌వ‌స‌త్వాలు కొల్పోయిన కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఈ మ‌హానేత‌కే ద‌క్కుతుంది.వైఎస్ఆర్ మ‌ర‌ణించి 9 సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న నేటికి ఆయ‌న పేరు తెలుగు రాజ‌కీయ‌ల‌లోకి మార్మోగుతుంది అంటే అంత‌లా ఆయ‌న ప్ర‌జ‌ల‌లో ఆద‌ర‌ణ సంపాదించారు.ఇప్ప‌డు ఆయ‌న జీవితం ఆధారాంగా తెర‌క్కెకిస్తున్న బయోపిక్ చిత్రం ‘యాత్ర’ సినిమాకు సంబంధించిన వార్త‌లు నిత్యం ఏదోఒక‌టి వ‌స్తునే ఉంది. తాజాగా వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నా మళయాళ మెగాస్టార్‌ మమ్మూటీ త‌న లుక్‌ని ట్వీట్ట‌ర్ ద్వారా అభిమాన‌లకు ప‌రిచియం చేశాడు.

ఈ ఫోటోని చూస్తుంటే వైఎస్ఆర్ మ‌ళ్లీ పుట్టాడా అనే అనుమానం క‌లుగుతుంది.అచ్చం వైఎస్ఆర్ లాగే ఉన్నా మమ్మూటీని చూసి వైఎస్ఆర్ అభిమానులు మురిసిపోతున్నారు.పంచె క‌ట్టు,ఆ చెప్పులు ధ‌రించ‌డం కాని అన్ని వైఎస్ఆర్‌ని గుర్తుకు తెస్తున్నాయి.జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత బయోపిక్‌పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -