బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Balakrishna Hikes his Remuneration to 10 Crores

ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచారనే న్యుస్ హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ తన రెమ్యునరేషన్ పెంచలేదు. మాములుగా బాలయ్య సినిమాకి రూ. 7 కోట్లు తీసుకునే ఆయన.. కొన్నేళ్లుగా ఇదే మొత్తాన్ని తీసుకుంటున్నాడు.

సరైన హిట్ లేక ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయలేదు. నిర్మాతలపై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకే తన రెమ్యునరేషన్ పెంచలేదు బాలకృష్ణ. కానీ ఇప్పుడు బాలయ్య తన రెమ్యూనరేషన్ ను 10 కోట్లు చేశారట. గౌతమిపుత్ర శాతకర్ణితో భారీ హిట్ కొట్టడమే కాకుండా.. ఏకంగా 50 కోట్ల షేర్ ని రాబట్టారు బాలకృష్ణ. అంతే కాదు.. ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తాన్ని వసూలు చేయగలిగారు.

దీంతో ఇకపై తన రెమ్యూనరేషన్ ను 10 కోట్లు చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య రేంజ్ ఉన్న హీరో ఈ మొత్తం అందుకోవడం సాధారణమే అంటున్నారు సినీ జనాలు. మాస్ లో అదిరిపోయే ఇమేజ్ ఉన్న బాలకృష్ణ నుంచి.. అభిమానులు ఆశించే స్థాయిలో సినిమా వస్తే.. ఒక్క ఏరియా నుంచే ఈ కలెక్షన్స్ వచ్చేస్తాయి.

Related

  1. చిరు.. వెంకీ.. బాలయ్య తో నాగ్ మల్టీ స్టారర్
  2. షాకింగ్ : హైప‌ర్ ఆదిని చంపేస్తానని బాల‌య్య వార్నింగ్‌
  3. ఆ అమ్మాయి ప్రేమలో బాలకృష్ణ వారసుడు…?
  4. బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!