గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం..

- Advertisement -

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం చోటు చేసుకుంది. రహదారిపై వ్యక్తిని దుండగులు కిరాతంగా కొట్టారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని అడ్డగించిన ప్రత్యర్థులు బాధితున్ని డివైడర్ మీద పడేసి చితక బాధారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీస్ సైరన్ విన్న ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు.

పాత కక్షలు, పొలంగట్ల పగలతో వారు తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. గత కొంతకాలంగా పిడుగురాళ్ల మండలం తుమ్మలపల్లికి చెందిన సైదా అనే వ్యక్తితో మరోకరికి భూ తగాదాలున్నాయి. ఈ విషయంలో ప్రత్యర్థులతో పలు మార్లు తనకు గోడవ జరిగిందని, పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తాను ఒంటరిగా వస్తున్నది చూసి వాళ్లు తనను చంపాలని చూసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.

- Advertisement -

మరోవైపు పాత కక్షలు ఉండే గ్రామ పంచాయితీల్లో గాని, పోలీస్ స్టేషన్‌లో గాని చూసుకోవాలి అంతేకానీ ఇలా కొట్టడం, నరకడం వల్ల సమస్యలు తీరవని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇంటాటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారి సిబ్బందికి అదేశాలు జారీ చేశారు.

ఇండస్ట్రీకి తమ మద్దతు ఉంటుంది

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -