విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యల చేయడంతో.. రాష్ట్రంలో ఇంకావేడి దగ్గతేదు. మా నాయకుని కుటుంబాన్ని దూషిస్తారా అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రడు ధర్నాకు దిగాడు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు నర్సీపట్నం చేరుకున్నారు.

నర్సీపట్నంలో ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించే సమయంలో అడ్డురానీ పోలీసులు నిరసన యాత్ర సగం దూరం వచ్చాక అడ్డువచ్చిందో లేక పై అధికారులు యాత్రను ఆపాలని అదేశాలు జారీ చేశారో ఉన్నట్లుండి పోలీసులు మాజీ మంత్రి నిరసన కార్యక్రమానికి అడ్డువచ్చారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

- Advertisement -

పోలీసులపై రగిలిపోయిన మాజీ మంత్రి తాము పోలీసుల పర్మిషన్ తీసుకొనే నిరసన యాత్ర చేపట్టామని, మధ్యలో మీరు ఎందుకు అడ్డు వస్తున్నారని ప్రశ్నించారు. తమ అధినేతకు వైసీపీ శ్రేణులు క్షమాపణలు చెప్పాలని ఆయన రోడ్డుపై బైటాయించారు. దీంతో టీడీపీ శ్రేణులు అందరూ రోడ్డుపై బైటాయించారు.

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

ఢిల్లీలో సీఎం సార్ ఏంచేస్తున్నారు..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -