Saturday, April 20, 2024
- Advertisement -

ఇండస్ట్రీకి తమ మద్దతు ఉంటుంది

- Advertisement -

సినిమా టికెట్లను ప్రభుత్వ విధానంలోనే ఆన్‌లైన్‌లో విక్రయించాలని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రభుత్వ నియమావలి ప్రకారం ఒక్కరోజుకు నాలుగు షోలు మాత్రమే ఆడాలని కాని కొందరు రోజుకు ఐదు, ఆరు షోలు నడిపిస్తున్నారన్నారు. అలా నిర్వహిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పేర్ని నాని గట్టిగానే హెచ్చరించారు.

గతంలో మావీ ఆర్టీసులకు తమ ప్రభుత్వం సౌకర్యలు కల్పించలేదని తమపై కొందరు వ్యక్తులు బహిరంగంగా విమర్శించారని మత్రి పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా విమర్శించారు. తాము తెలుగు సినీ ఇండ్రస్టీకి ఎప్పుడూ మద్దతుగానే ఉంటామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖుల అనుమానాలపై తెరపడినట్లైంది.

తమకు చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడాలేదన్న మంత్రీ.. రాష్ట్రంలో 1100 థియేటర్లలో టికెట్ల విక్రయం చేపడుతామన్నారు. కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకు, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేదన్నారు. ఆన్‌లైన్‌ల టికెట్ల వ్యహరంలో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లేని అభ్యంతరం ఇండస్ట్రీలో ఉన్న కొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొందరు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఊరూ వాడా దండోరా దండోరా..!

ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారు…

మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -