Friday, May 3, 2024
- Advertisement -

భర్త ఆత్మ‌హ‌త్య కేసు విచారిస్తుంటే భార్య హ‌త్య వెలుగులోకి…

- Advertisement -

రైలు కిందపడిన వ్య‌క్తి ఆత్మహత్య చేసుకున్న కేసునుపోలీసులు ఛేదిస్తున్న క్రమంలో ఆయన భార్య హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చిన ఘటన హైదరాబాద్ పరిధిలోని నల్లకుంటలో కలకలం రేపింది. వివ‌రాల్లోకి వెల్తే వెళితే నల్గొండ జిల్లాకు చెందిన మాధవ్ (30)కు, అదే జిల్లాకు చెందిన సుమలత (25)తో గత సంవత్సరం వివాహమైంది. కొద్ది నెలలుగా మాధవ్‌ సిండికేట్‌ బ్యాంకు నల్లకుంట శాఖలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు.

కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరుచూ గొడవ పడేవారు. దీనికి తోడు భార్యపై అనుమానం పెంచుకున్న మాధ‌వ్ ఈ నెల 21న విద్యానగర్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధవ్ మృతి తరువాత సుమలత అదృశ్యం కావడంతో, ఆత్మహత్య వెనుక సుమలత ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆమెకు వివాహేతర సంబంధం ఉందని మాధవ్ అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి. దీంతో ఆమె ఈ మధ్య పుట్టింట్లోనే ఎక్కువగా ఉండేది. సుమలతను గత సోమవారమే ఆమె తల్లి భర్త దగ్గరకు తీసుకొచ్చింది. రెండ్రోజులు ఉండి ఆమె సొంతూరు వెళ్లిపోయింది.

శనివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది. మాధవ్ క్షణికావేశంలో సుమలత మెడ చుట్టూ చున్నీతో ఉరి బిగించడంతో ఆమె చనిపోయింది. భార్యను చంపేసిన తర్వాత మాధవ్ భయాందోళనకు గురయ్యాడు. ఆమె శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లి ఎంఎంటీఎస్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.

ఐడీ కార్డు ఆధారంగా విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు సాయంత్రం సమయంలో మృతుడి తండ్రి మలయాద్రికి సమాచారం ఇచ్చారు. ఆయన సుమలత తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఆమె తన కూతురికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన ఆమె.. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నల్లకుంట చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసుకుల సమాచారం ఇచ్చారు. తాళం పగలగొట్టి చూడగా.. సుమలత నిర్జీవంగా కనిపించింది.

గొంతుకు చున్నీతో ఉరేసి, ఆపై దిండు ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న పోలీసులు, కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -