Wednesday, May 8, 2024
- Advertisement -

సుప్రీం కోర్టులో కేసు వేయండి.. హోదా ఇచ్చేవారికే మా మద్దతు

- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలపై రాజ్యసభలో వైఎస్ఆర్ సీపీ నోటీస్ ఇచ్చింది. ఈ వారంలో రోజుల్లో తామిచ్చిన నోటీస్ పై కచ్చితంగా చర్చ చేపడతారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం తనదని చెప్పుకునే చంద్రబాబు, ప్రత్యేకహోదా మోసంపై ఎందుకు పోరాడలేకపోయారని, ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని నిలదీశారు. హోదా సాధనలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నేడు హోదా కోరుతున్న చంద్రబాబు నాడు మోడీ ఇచ్చిన ప్యాకేజ్ బాగుందని ఎందుకు పొగిడారని ప్రశ్నించారు. పొగడ్తలతో ఆగకుండా ధన్యవాద తీర్మానం కూడా చేశారు కదా అని గుర్తు చేశారు. చంద్రబాబు కోరిక మేరకే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిందని, అందుకే ఆ ప్యాకేజీకి ధన్యవాద తీర్మానం కూడా చేశారన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ప్యాకేజ్ పై మాటమార్చిన చంద్రబాబు నాడు చేసిన ధన్యవాద తీర్మానాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నారా ? లేదా ? అని ప్రశ్నించారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, ప్రత్యేక ప్యాకేజ్ కి చట్టబద్ధత కల్పించాలని ఎందుకు కోరలేదని నిలదీశారు.

ప్రత్యేక హోదాను ఎటూ నీరుగార్చిన టీడీపీ ప్రత్యేక ప్యాకేజ్ విషయంలోనూ డ్రామాలాడుతోందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ప్యాకేజ్ కి చట్టబద్ధత కల్పించి ఉంటే హైకోర్టులో వ్యాజ్యం కూడా పెద్ద పొలిటికల్‌ డ్రామానే అని ఆరోపించారు. నిజంగా టీడీపీకీ రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే ఆర్టికల్‌ 300 ప్రకారం సుప్రీం కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి, చంద్రబాబు, ఆయన పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయతీగా పోరాడాలని కోరారు. నాడు చంద్రబాబు సహాయంతో సీఎంగా కొనసాగిన మాజీ సీఎం కిరణ్ మళ్లీ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆయన హయాంలోనే కాంగ్రెస్ నాడు రాష్ట్ర విభజన చేయించందన్న విషయాన్ని జనం మరిచిపోలేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని విజయసాయి రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -