Saturday, May 4, 2024
- Advertisement -

కరోనా ఉందని తెలిసి షూటింగ్ కి హాజరైన హీరోయిన్.. కేసు నమోదు!

- Advertisement -

ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కేసులు భయపెడుతున్నాయి. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి వైరస్ కోట్ల మందిని క్షోభపెట్టింది. ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుంది. దీంతో మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ దిశగా ఆలోచనలు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత ఇండియాలో 25 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇంత దారుణమైన సమయంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ పాడు పని చేసింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి కూడా సినిమా షూటింగ్ కు వచ్చి తనతో పాటు అందర్నీ ప్రమాదంలో పడేసింది.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వైరస్ సోకితే రెండు వారాలు బయటికి రాకూడదు. కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతూ పాజిటివ్ తోనే షూటింగ్ కు వచ్చింది బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్. ఇక కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు ముంబై పోలీసులు. కాగా,సినిమాలు, టీవీ షోలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది గౌహార్ ఖాన్ కి ఈ మధ్యే కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమెను క్వారంటైన్ లో ఉండాలని, మెడిసెన్స్ వాడాలని వైద్యులు సూచించారు.

కానీ గౌహార్ షూటింగ్‌కు వచ్చిందని BMC అధికారి తెలిపారు. దాంతో ఈమెపై బీఎంసీ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. అంతేకాదు దీనిపై పౌరసంఘం కూడా ట్వీట్ చేసింది.  కరోనా నియమ నిబంధనలు అందరికీ వర్తిస్థాయని.. ఇందుకు ఎవరూ అతీతులు కారని అంటున్నారు. అయితే కేసు నమోదు అయినప్పటి నుంచి ఆమె కనిపించకుండా ఉన్నారు. ప్రస్తుతం ఈమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కనీసం ఫోన్స్ కు కూడా రెస్పాండ్ కావడం లేదు గౌహార్ ఖాన్. వీలైనంత త్వరగా ఈమె జాడ కనుగొంటామని చెప్తున్నారు ముంబై పోలీసులు.

తెదేపా, జనసేనపై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు!

జెర్రీపండు డ్రెస్ లో కాకపుట్టిస్తున్న జాన్వీ కపూర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -