ఏపిలో వరుసగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అఖండ విజయం సాధించింది. అయితే ఈ విజయం వారిది కాదని.. ప్రలోభాలు, ఓటర్లను భయపెట్టి అధికార జులుంతో నెగ్గారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు బీభత్సంగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఏపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, పవన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు వానపాము లేచి నాగుపాముపై బుసకొట్టినట్లు ఉందన్నారు. పవన్‌కు అసలు జెండా, అజెండానే లేవని ఘాటుగా విమర్శించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మనవడితో ఆడుకుంటూ శేషజీవితం గడపాలంటూ రోజా ఎద్దేవా చేశారు. 18 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్ని కొల్లగొట్టారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ ఎలాగూ వైసీపీకి అనుకూలంగా వస్తాయని తెలిసే.. చంద్రబాబు, పవన్ లు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. పవన్ ఒక్కోచోట ఒక్కో పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని.. ఆయనకు ఒక స్పష్టతే లేదని వ్యాఖ్యానించారు. నా ఉద్దేశంలో తెదేపాను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.
‘జాతిరత్నాలు’ బ్యూటీకి బంపర్ ఆఫర్?
