- Advertisement -

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. సీఐడీ నోటీసులు జారీ!

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సిఐడి అధికారులు చేరుకున్నారు. ఈ సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.  కాగా, రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా చంద్రబాబుకు 41 సీఆర్పీసీ నోటీలిచ్చారు.

ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే రాజధాని ప్రకటనను ముందుగానే లీక్ చేయడం ద్వారా అక్కడ వేలాది ఎకరాలను ముందుగానే కొనుగోలు చేసిన అప్పటి మంత్రులు, టీడీపీ నేతలు భారీగా లబ్ధిపొందారన్నది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. చంద్రబాబుతో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది.

విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ తన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. చంద్రబాబుపై మూడు రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సెక్షన్లు 120బి, 166, 167, 217 కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

కరోనా ఉందని తెలిసి షూటింగ్ కి హాజరైన హీరోయిన్.. కేసు నమోదు!

తెదేపా, జనసేనపై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు!

జెర్రీపండు డ్రెస్ లో కాకపుట్టిస్తున్న జాన్వీ కపూర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -