Saturday, April 27, 2024
- Advertisement -

ఈ నీచున్ని ఏం చేయాలి? కన్నకూతురు పై ఏడేళ్లుగా అత్యాచారం!

- Advertisement -

కామా తురానాం న భయం న లజ్జ అన్నట్టు కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ తండ్రి తన కూతురుపైనే ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ నీచమైన సంఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. 17 ఏళ్ల కన్న కూతురిపైనే ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ పలు సార్లు గర్భస్రావం చేయించిన కిరాతక తండ్రి బాగోతం హర్యానా రాష్ట్రంలోని హిసార్ నగరంలో వెలుగుచూసింది.  హిస్సార్ నగరానికి చెంది ఈ దుర్మార్గుడు ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే తన కూతురు పై ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ చివరికి పాపం పండటంతో కటకటాలపాలయ్యాడు. అతని హాింస తట్టుకోలేక తన తండ్రి తనపై ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ పలు సార్లు గర్భస్రావం చేయించాడని 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తన తండ్రి 11 ఏళ్ల వయసుగల సోదరిని కూడా వేధించాడని బాలిక ఫిర్యాదులో వెల్లడించింది. ఇక ఈ దారుణానికి పాల్పపడిన నీచుడికి ఐపీసీ సెక్షన్ 376 (2), 376(2)ఎఫ్, 506, 323, 354ఎ(1) ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -