Tuesday, April 23, 2024
- Advertisement -

కూతురిని ప్రేమించాడని యువకుడి దారుణ హత్య

- Advertisement -

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ ని ప్రేమించినందుకు ఆమె తండ్రి హీరోని, అతని కుటుంబాన్ని ఎన్నో కష్టాలకు గురి చేస్తుంటాడు. రౌడీలతో హీరో పై అటాక్ చేయిస్తుంటాడు. తాజాగా సినీ ఫక్కీలో తన కూతురు ని ప్రేమించాడని ఓ తండ్రి యువకుడి కాళ్లు చేతులు నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియేట్ చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఈ విషయం యువతి తల్లితండ్రులకు తెలిసింది. వెంకటేష్ ను పిలిపించి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో వెంకటేష్ ఊరు వదిలి వెళ్లి పోయాడు.. కానీ ఆ యువతితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. తన కూతురిని వెంకటేష్ విడిచి పెట్టడని తెలుసుకున్న యువతి తండ్రి భాస్కరరావు కోపంతో రగిలి పోయాడు.

ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి మట్లాడదాం రమ్మని వెంకటేష్ ను గ్రామంలోకి పిలిచాడు. అక్కడ నుంచి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి తన బంధువులతో ఆ యువకుడి కాళ్లు చేతులు దారుణంగా నరికేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి గాయపడిన వెంకటేష్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ కన్ను మూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జీవితంలో గెలవాలంటే ఈ రెండు సూత్రాలు పాటించాలి.. సమంత!

హమ్మయ్య నాకు నెగిటీవ్ వచ్చింది : అనీల్ రావిపూడి

టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -