Wednesday, May 1, 2024
- Advertisement -

మరో బాలిక కేసు.. మత మార్పిడి చేసి మరి ఆ అబ్బాయ్..!

- Advertisement -

14ఏళ్ల బాలికను అపహరించి బలవంతంగా మత మర్పిడి చేసి వివాహం చేసుకున్న యువకుడిని ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పుర్​ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇటీవల తీసుకువచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు.

బిహార్​ నుంచి వలస వచ్చి షాపూర్​లో నివసిస్తున్న తబారక్​ ఖాన్​(23) అనే యువకుడు.. ఆరో తరగతి చదువుతున్న తన కూతురుని హింసిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపించింది. మూడు రోజుల క్రితం కూతురు స్కూల్​ బ్యాగ్​లో ‘నిఖానామా’ (పెళ్లి పత్రం) అనే పత్రాన్ని కనుగొన్నట్లు వెల్లడించింది. కూతురుని ప్రశ్నించగా.. మార్చి 1న తబారక్​ అపహరించి వివాహం చేసుకుని.. ఇంటి వద్ద వదిలివెళ్లాడని కూతురు వెల్లడించినట్లు పోలీసులకు తల్లి తెలిపింది.

నిఖా నామాను పోలీసు స్టేషన్​కు తీసుకువచ్చింది.బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అపహరణ, యూపీ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం-2020 కింద కేసులు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఎస్​కే సింగ్​ తెలిపారు. బాలిక వైద్య రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు.

బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత మరిన్ని కేసులు జతచేసే అవకాశాలున్నాయని అన్నారు. నిఖా నామాలో బాలిక పేరు మార్చినట్లు పేర్కొన్నారు. వివాహం జరిపించడానికి తబారక్​కు సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

వారెవ్వా..ఈ మహిళ బంగారం ఎక్కడ పెట్టుకుంది చూడండి..!

మోచేతులు, మోకాల్లు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసం !

రుణ యాప్‌ల కేసులో నిందుతుడు ఎవరో కాదు.. తెలుగు వాడే..!

ఖాళీ క‌డుపుతో ఖర్జూర‌లు తింటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -