Thursday, May 2, 2024
- Advertisement -

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

- Advertisement -

అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తోందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పోషకాలు మెండుగా కలిగి ఉన్న ఈ అరటి పండు రోజుకు ఒక్కటి తింటే చాలు మన ఆరోగ్యానికి ఏ డోకా లేదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ అరటి పండు మన శరీరానికి అవసరమైన పొటాషియంను కూడా అందిస్తుంది. పూర్వం ఈ అరటి పండును తినేవారు తెలివిగల వారు మాత్రమే తినే పండుగా భావించేవారట. ఇకపోతే చాలా మంది ఈ పండును మాత్రమే తిని తొక్కలో తొక్క అని విసిరిపడేస్తుంటారు.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. అరటి పండుతో పాటుగా.. అరటి తొక్క కూడా ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉంటుందనే విషయం తెలియదు. సో ఈ అరటి తొక్క మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందా పదండి. చర్మంపై దోమలు కుట్టడం వల్ల అయినా దద్దుర్లను, నొప్పిని తగ్గించడంలో ఈ తొక్క ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే చర్మంపై ముడతలు పోయి కాంతివంతంగా కనిపించాలంటే ఈ తొక్క ఎంతో మేలు. నల్లటి మచ్చలు కూడా పోతాయి.

డీప్ ఫ్రిజ్ లో ఓ అరగంట పాటు ఈ తొక్కను పెట్టి ఆ తర్వాత.. నుదురుపై పెట్టుకుంటే తీవ్రమైన తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కాలిలో ఇరిగిన ముల్లు రాకపోతే ఈ తొక్కను ముల్లు దిగిన ప్లేస్ లో పెట్టి తీసేస్తే ఈజీగా వస్తుంది. అయితే మాంసాహారంలో మటన్ ఎంతకీ ఉడకదు. అయితే మటన్ లో అరటి తొక్కను వేస్తే గనుక చిటికెలో మటన్ మెత్తగా ఉడికిపోతుంది. అలాగే తొక్క లోపలి భాగంతో వెండి సామాన్లను పాలిష్ చేస్తే అవి తళతళా మెరిసిపోతాయి. అలాగే ఈ లోపలి భాగంతో పళ్లను రబ్ చేస్తే కూడా పళ్లు తెల్లగా మెరుస్తాయి. పసుపు పళ్లు కలవారు ఈ తొక్కను ట్రై చేయడి.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -