Wednesday, May 1, 2024
- Advertisement -

మోచేతులు, మోకాల్లు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసం !

- Advertisement -

చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ద, సంరక్షణను చర్యలను మోచేతులు, మోకాళ్లపై పెట్టరు. ఫలితంగా ముఖం చేతులు నిగనిగలాడినా.. మోచేతులు, మోకాళ్లు నల్లగా మారిపోతాయి. దాంతో మీరు బయటకు వెళ్లిన ప్రతి సారి వాటిని దాచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోచేతులు, మోకాళ్లు నల్లగా పాలిపోయి కనిపిస్తాయి. వాటిని ఇబ్బందిగా భావించి.. వాటి కలర్ ను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారున్నారు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్.. ఈ కింది చిట్కాలను పాటిస్తే మీ మోచేతులు తెల్లగా మారిపోతాయి.

సహజంగా బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉన్న నిమ్మకాయ చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచుగా మోచేతులకు, మోకాళ్లపై రుద్దుతూ ఉండాలి. దీనివల్ల మోచేతులపై ఉండే నలుపు మాయమవుతుంది. అలాగే పసుపును పేస్ట్ లా చేసి మోచేతులపై, మోకాళ్లపై రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మ టోన్ మెరుస్తుంది. పదినిమిషాల తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే కలబంద గుజ్జును మోచేతులు, మోకాళ్లకు రాసి.. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పోషక విలువలు అంది.. చర్మం నిగనిగ మెరుస్తుంది. అలాగే తాజా సున్నపు రసాన్ని తీసుకుని నల్లగా మారిన మోచేతులపై రాసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైన చెప్పిన టిప్స్ ను ఖచ్చితంగా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -