Saturday, May 18, 2024
- Advertisement -

ర‌ష్యాలో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం..18 మంది దుర్మ‌ర‌ణం…

- Advertisement -

ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే కుప్ప‌కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 18 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న ర‌ష్యాలోని సైబీరియా ప్రాంతంలో జ‌రిగింది. ఉదయం 10.20 గంటలకు ముగ్గురు సిబ్బంది, 15 మంది ప్రయాణికులతో బయల్దేరిన హెలికాప్టర్‌ను .. పక్కనే ఉన్న మరో విమానంలోని పరికరాలు తగలడంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. రష్యాలోని సైబీరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10.20 గంటలకు ముగ్గురు సిబ్బంది, 15 మంది ప్రయాణికులతో బయల్దేరిన హెలికాప్టర్.. మరో హెలికాప్టర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇగర్కా నగరం నుంచి వాంకోర్ అనే సంస్థకు చెందిన సిబ్బందిని ఉత్తరప్రాంతంలో ఉన్న చమురు బావి వద్దకు తీసుకెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్.. అటుగా వెళ్తున్న కార్గో హెలికాప్టర్ వస్తువులను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కుప్పకూలింది. హెలికాప్టర్ ఆయిల్ ట్యాంకులు పేలడంతో ప్రయాణికులు, సిబ్బంది మంటలకు ఆహుతయ్యారు. అయితే, కార్గొ హెలికాప్టర్‌కు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -