- Advertisement -

వ్యభిచార ముఠాలో ఇద్దరు హీరోయిన్లు!

- Advertisement -

ముంబై గిర్‌గావ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో జరుగుతున్న హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఈ దాడుల్లో ఇద్దరు నటీమణులను రక్షించిన పోలీసులు, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ పరిశ్రమలోని పరిచయాలతో ఈ దందా నడుపుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. రక్షించిన వారిలో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాగా, మరొకరు బెంగాలీ సినిమాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. బాధితుల భద్రత దృష్ట్యా పోలీసులు వారి పేర్లను వెల్లడించలేదు. వారిని బాధితులుగానే పరిగణిస్తున్నామని, నిందితుడిని మాత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆ నటీమణులు హోటల్‌కు ఎలా వచ్చారు, వారిని ఎవరైనా బెదిరించారా లేదా ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. నిందితుడి ఫోన్ కాంటాక్ట్‌లను పరిశీలిస్తూ, ఈ దందాలో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.

కొద్ది రోజుల క్రితం థానేలోని కల్యాణ్ ప్రాంతంలో కూడా ఇలాంటి వ్యభిచార ముఠానే బయటపడింది. అక్కడ ఒక మహిళా న్యాయవాది ఈ దందాను నడిపిస్తున్నట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆమె ఈ ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు కస్టమర్ల వేషధారణలో వెళ్లి నిఘా పెట్టి, ఇద్దరు మహిళలను అప్పటికప్పుడు రక్షించారు.

ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై నిఘాను మరింత పెంచారు. ఈ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -