ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం వారణాసి లో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. గంగా ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవిత్రమైన గంగానది పై పడవ ప్రయాణం చేస్తూ ఉన్న ఇద్దరు మహిళలతో ఓ పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లుగా, పడవలో ఉన్న మహిళల బట్టలు లాగుతూ అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన అక్కడ ఉన్న ఇతరులకు షాక్ కలిగించింది. పూజారి ప్రవర్తనను తట్టుకోలేక మహిళలు వెంటనే ప్రతిఘటించారు. పూజారి అసభ్య ప్రవర్తనపై ఆగ్రహించిన మహిళలు అతనిపై దాడి చేశారు. అతన్ని చితక్కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు ధైర్యంగా స్పందించి తమను తాము రక్షించుకున్న తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
దాడి నుండి తప్పించుకునేందుకు ఆ పూజారి చివరకు గంగానదిలోకి దూకినట్లు సమాచారం. పడవలో ఉన్న వారు అతని చర్యతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది మహిళల ధైర్యాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఇలాంటి సంఘటనలు పుణ్యక్షేత్రాల్లో జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
