- Advertisement -

భర్త రెండో పెళ్లి..కొడుకులను చంపేసిన భార్య!

- Advertisement -

హైదరాబాద్ – కూకట్‌పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో తన ఇద్దరు కొడుకులు కార్తీక్(12), కౌశిక్(10)లను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకుంది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన స్రవంతి(28) అనే మహిళ.

భర్త ప్రవీణ్ మహేశ్వరి అనే మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, మనస్తాపంతో పుట్టింటికి వెళ్లి పెద్దమనుషుల వద్ద పంచాయతీకి పిలిచారు స్రవంతి. దీంతో ఇకపై భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని పెద్దమనుషుల ముందు చెప్పి, వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు ప్రవీణ్.

నిన్న విధులకు వెళ్లి తిరిగి వచ్చే సరికి, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న స్రవంతిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు భర్త.నిన్న ఉదయం ప్రవీణ్, స్రవంతిలకు మధ్య మరోసారి గొడవ జరగగా, ప్రవీణ్ తనను చంపేస్తా అని బెదిరిస్తున్నాడని స్రవంతి సోదరుడికి వీడియో మెసేజ్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

భర్తపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా విషయం తెలుసుకున్న స్రవంతి కుటుంబ సభ్యులు స్వగ్రామంలోని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -