Saturday, May 4, 2024
- Advertisement -

విజయవాడ మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడి..ప‌ట్టుబ‌డిన 11 మంది యువ‌తులు

- Advertisement -

మసాజ్‌ సెంటర్లలో బెజవాడ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోప‌న‌లు రావ‌డంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. టాస్క్ ఫోర్క్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు.

పోలీసులు దాడులకు వెళ్లిన సమయంలో డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్ లలో క్రాస్ మసాజ్, వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. ఇద్దరు మహిళా నిర్వాహకులు, 11 మంది మసాజ్ చేసేందుకు వచ్చిన అమ్మాయిలు సహా, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని, రెండు పార్లర్ లపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు .పట్టుబడిన వారిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -