నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య

తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. సొంతంగా ‘సొంతిప్పొమ్ సింతిప్పొమ్’ నిర్మించి, దానిలో హీరోగా నటించిన కుమారజన్ సక్సెస్ సాధించలేకపోయాడు. ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు రాక, మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

నమక్కల్‌లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కుమారజన్‌ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.