- Advertisement -

సీఎం రిలీఫ్ ఫండ్‌లో టీడీపీ నేతల చేతివాటం

- Advertisement -

సీఎం రిలీఫ్ ఫండ్‌లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. ఓ బాధితుడికి వచ్చిన రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు తమ అకౌంట్లో వేసుకున్నాడు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు తుంటి ఎల్లయ్య. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.14 లక్షలు మంజూరు అయ్యాయి.డబ్బులు ఇస్తామని బ్యాంక్ కు తీసుకెళల్లారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు .

ఎల్లయ్య వద్ద సంతకాలు పెట్టించుకుని డబ్బులు అకౌంట్ లో పడ్డాయని పంపించారు తెలుగు తమ్ముళ్లు. ఇంటికొచ్చి మొబైల్ లో మెసేజ్ చూసుకున్నాడు ఎల్లయ్య . అకౌంట్ కు రూ.14 లక్షలు జమ.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవధిలో టీడీపీ నేత అకౌంట్ లోకి రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి.

విషయం తెలుసుకుని టీడీపీ నేతలను నిలదీశాడు ఎల్లయ్య.తమకు ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పినట్టు పేర్కొని ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు ఎల్లయ్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -