Monday, April 29, 2024
- Advertisement -

ఎక్కడ తగ్గాలో తెలియనోడు..పవన్!

- Advertisement -

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు..ఇది పవన్ సినిమాలో డైలాగ్. ఇదే డైలాగ్‌ని ఉపయోగించి పవన్‌పై సెటైర్ వేశారు మంత్రి అంబటి రాయుడు. ఎక్స్‌లో ట్వీట్‌ చేసిన అంబటి..ఎక్కడ నెగ్గాలో తెలియనోడు…ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు అని పవన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

సీఎం సీఎం అని అరిసిన ఓ కాపులారా! సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా? అంటూ వరుస ట్వీట్‌లు చేశారు. అంబటి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా ఎంపీతో పాటు ఎమ్మెల్యే సీట్లను వదులుకునేందుకు పవన్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు కేటాయించగా ఇందులో ఒక ఎంప, 3 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌పై జనసైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మంత్రి అంబటి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -