Sunday, April 28, 2024
- Advertisement -

అర గుండుతో ఎంట్రీ.. ఎవర్ గ్రీన్ జర్నీ.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

- Advertisement -

నవ్వుల రాజు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమాలో ఉన్నారు అంటే ఆ సినిమాలో కామెడీకి కొదవ ఉండదని ఫిక్స్ అవ్వొచ్చు. స్టార్ హీరోనా, స్మాల్ హీరోనా అన్న లెక్కలేమి చూసుకోకుండా అందరి సినిమాల్లో కామెడీ చేస్తూ ఆడియన్స్ ని నవ్విస్తూ వచ్చారు బ్రహ్మానందం. దాదాపు 1000 సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డ్ లో కూడా అందుకున్న బ్రహ్మి కెరీర్ లో ఇప్పటికీ తన ఫాం ని కొనసాగిస్తున్నారు.

స్వతహాగా తెలుగు లెక్చరర్ అయిన ఆయన రంగస్థల నాటికల మీద ఆసక్తి కనబరిచారు. బ్రహ్మానందం మొదటి సినిమా జంద్యాల డైరెక్షన్ లో వచ్చిన అహ నా పెళ్లంట. ఆ సినిమాఓ అర గుండు పాత్రలో బ్రహ్మానందం కామెడీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఆ సినిమా చూశాకనే బ్రహ్మి కి చిరంజీవి పసివాడి ప్రాణం సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక వరుస సినిమాలతో అప్రతిహాతంగా తన కెరీర్ కొనసాగించారు బ్రహ్మానందం. బ్రహ్మానందంకి ఇష్టమైన హీరోలు ఇద్దరు ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు చిరంజీవి మరొకరు నాగార్జున. నాగ్ అయితే చాలాసార్లు బ్రహ్మి ఫోటోని తన పాకెట్ లో పెట్టుకుంటాడని ఆ ఫోటో చూస్తేనే నవ్వొస్తుందని చాలా సందర్భాల్లో చెప్పారు.

బ్రహ్మానందం కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు గౌతం కాగా.. మరొకరు సిధ్. గౌతం హీరోగా ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. మొదటి సీమా అహ నా పెళ్లంట సినిమాకు 6 వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న బ్రహ్మానందం ఆ తర్వాత 50 లక్షల నుంచి కోటి దాకా కూడా పాతిరోషికం పుచ్చుకున్నారు. ఇక బ్రహ్మానందం మొత్తం ఆస్తుల విలువ సుమారుగా 500 నుంచి 600 కోట్ల దాకా ఉంటాయని తెలుస్తుంది. రీసెంట్ గా ఆయన రంగమార్తాండ సినిమాలో సీరియస్ రోల్ లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు బ్రహ్మి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -