Thursday, May 2, 2024
- Advertisement -

సలార్ 1000 కోట్ల బిజినెస్.. ప్రభాస్ రేంజ్ అంటే ఇదే..!

- Advertisement -

ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా దాంతో సినిమాపై భారీ అంచనాలు పెంచాడు ప్రశాంత్ నీల్. హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. సలార్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ సినిమా అంటే బిజినెస్ విషయంలో దుమ్ము దులిపేస్తుంది. సలార్ సినిమా కూడా ఆ జోరు కొనసాగిస్తుంది.

సలార్ సినిమా బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సలార్ రెండు పార్ట్ లు కలుపుకుని థియేట్రికల్ బిజినెస్సే 1000 కోట్ల దాకా జరుగుతుందని తెలుస్తుంది. సలార్ పార్ట్ 1 కి తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్లు.. హిందీ నుంచి 400 కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చిందట. ఇక మిగతా ఏరియాల్లో మరో 100 కోట్లు. సో ఫైనల్ గా సలార్ సినిమా పార్ట్ 1 బిజినెస్ 500 కోట్లు పార్ట్ 2 మరో 500 కోట్లు చేస్తుందని తెలుస్తుంది.

ఈ బిజినెస్ తో ప్రభాస్ రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా కూడా భారీ స్థాయిలో రాబోతుంది. ప్రభాస్ సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -