Sunday, May 5, 2024
- Advertisement -

బీజేపీకి 5 సీట్లే..!

- Advertisement -

ఇదిగో..అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన టీడీపీ -జనసేన ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. మొత్తం 175 స్థానాలకు గానూ 118 స్థానాలతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించారు. ఇందులో టీడీపీ 94, జనసేన 24 స్థానాలున్నాయి. ఇక మిగిలినవి 57 సీట్లే.

ఇక టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరగా ఫస్ట్ లిస్ట్‌లో ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఉంటారని అంతా భావించారు. అయితే బీజేపీ లేకపోవడంతో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీజేపీ ఆశీస్సులతోనే పస్ట్ లిస్ట్ ప్రకటించామని చెప్పడం విశేషం. దీంతో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎంతగా వెంపర్లాడుతున్నారో అర్ధం అవుతుంది.

అయితే లిస్ట్ ప్రకటన అనంతరం బీజేపీకి 4 లేదా 5 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. మరి ఇంత తక్కువ స్థానాలకు బీజేపీ అంగీకారం తెలుపుతుందా వారిని చంద్రబాబు ఎలా ఒప్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -