Saturday, May 4, 2024
- Advertisement -

మాజీ మంత్రి గంటాకు నిరాశేనా?

- Advertisement -

టీడీపీ సీనియర్లకు దిమ్మ తిరిగింది. మొదటి నుండి సీనియర్లకు షాక్ తప్పదని హింట్ ఇస్తు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అదే పనిచేశారు. జనసేనతో పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్‌లో 94 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ లిస్ట్‌లో టీడీపీ సీనియర్లకు భంగపాటు తప్పలేదు. వీరిలో కళా వెంటట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా మహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, మండలి బుద్ద ప్రసాద్ లాంటి వారున్నారు.

ఇక లిస్ట్ ప్రకటించే మూడు రోజుల ముందునుండే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గంటా శ్రీనివాసరావు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఈసారి భీమిలి లేదా పెందుర్తి టికెట్ ఆశీంచారు. కానీ గంటాకు చీపురుపల్లి టికెట్ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చీపురుపల్లి నుండి పోటీ చేసేందుకు గంటా విముఖుత వ్యక్తం చేసినట్లు తెలియగా ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ప్రస్తావనే లేకుండా పోయింది.

గంటా ఆశీస్తున్న భీమిలి జ‌న‌సేన‌కు కేటాయించారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాద‌వ్ పోటీ చేయ‌నుండగా ఇది గంటా వర్గానికి మింగుడు పడటం లేదు. అలాగే గంటా ఆశించిన మరో నియోజకవర్గం పెందుర్తి నుండి కూడా జనసేనే పోటీచేయనుంది. ఇక విశాఖ జిల్లాలోని మరేదైనా నియోజకవర్గం నుండి గంటా పోటీ చేయాలని భావిస్తున్న చోటు లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు గంటా పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -