ఏపీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 13న పోలింగ్,జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగనున్నాయన్నారు సీఈసీ రాజీవ్ కుమార్.ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించనుండగా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 26న ఉండనుండగా ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29. మే 13న కౌటింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు.ట్రాన్స్జెండర్ ఓటర్లు 48 వేలు,దివ్యాంగులు 88 లక్షల మందిఓటర్లు ఉన్నారన్నారు.
ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామన్నారు.ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపడతామన్నారు.టీవీ, సోషల్ మీడియా ప్రక్రటనలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కానుకలను, ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారంలో ఎవరూ హద్దుమీరి వ్యాఖ్యలు చేయవద్దు అన్నారు.
