Thursday, May 2, 2024
- Advertisement -

సోషల్ ఇంజనీరింగ్..బడుగులకే పెద్దపీట

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ తుది జాబితా వచ్చేసింది. మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితా రిలీజ్ అయింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ పాటించిన సీఎం జగన్…బడుగులకు పెద్దపీట వేశారు. ఇక 175 అసెంబ్లీ,25 ఎంపీ స్థానాల్లో 50 శాతం అంటే 84 ఎమ్మెల్యేలు,16 ఎంపీ స్థానాలను బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఇచ్చారు.

ఎమ్మెల్యేల విషయానికొస్తే ఎస్సీ -29,ఎస్టీ -7,బీసీ -48,ఓసీ -91లకు కేటాయించారు. ఇందులో 7గురు మైనార్టీలు ఉండగా 19 మంది మహిళలు ఉన్నారు. ఇక ఎంపీల విషయానికొస్తే ఎస్సీ -4,ఎస్టీ-1,బీసీ-11,ఓసీ -9 మందికి ఇవ్వగా ఇందులో 5 గురు మహిళలు ఉన్నారు. 2019తో పోలిస్తే బడుగుల వర్గాలకు ఎక్కువ స్థానాలు కేటాయించారు జగన్.

2019లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 77 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా తాజాగా 84 స్థానాలు ఇచ్చారు. ఇక 2019లో 15 మంది మహిళలకు సీట్లు ఇవ్వగా తాజాగా 19 మందికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు జగన్. 2019లో 5 గురు మైనార్టీలకు సీటు ఇవ్వగా ఇప్పుడు 7గురికి ఛాన్స్ వచ్చింది. ఎంపీ స్థానాల విషయానికొస్తే 2019లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 12 స్థానాలు ఇస్తే ఇప్పుడు 16 మంది ఛాన్స్ ఇచ్చారు జగన్. 2019లో వైసీపీ తరపున 4గురు ఎంపీలుగా పోటీ చేయగా ఇప్పుడు 5గురు పోటీ చేయనున్నారు.

ఇక మహిళలకు పెద్దపీట వేశారు జగన్. ఈసారి ఎంపీలుగా 5గురికి, ఎమ్మెల్యేలుగా 19 మందికి అవకాశం కల్పించారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో 153 మంది(ఎంపీ, ఎమ్మెల్యే) కలిపి గ్యాడ్యేయేట్లు, అంతకన్న ఎక్కువ చదివిన వారుండగా ఇందులో 58 మంది పీజీ,6గురు డాక్టరేట్ పొందిన వారున్నారు. 17 మంది డాక్లర్లు,15 మంది లాయర్లు,34 మంది ఇంజనీర్లు,5 గురు టీచర్లు,ఇద్దరు సివిల్ సర్వెంట్స్, ఒక డిఫెన్స్‌ అభ్యర్ధితో పాటు ఒక జర్నలిస్ట్ సీటు దక్కించుకున్నారు. ఎంపీ అభ్యర్థ/ల్లో 22 మంది గ్రాడ్యుయేట్, అంతకన్న ఎక్కువ చదవగా ఇందులో 11 మంది పీజీ,నలుగురు డాక్టర్లు,4గురు లాయర్లు,ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -