Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌పై బాలయ్య అక్కసు!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు నందమూరి బాలకృష్ణ. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు బాలయ్య. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి బాలయ్యకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే టీడీపీ నేతలతో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఆదేశించారు. అయితే ఇదంతా వీడియోలో రికార్డు కాగా బాలయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాస్తవానికి ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యామిలీకి గ్యాప్ ఎప్పుడో పెరిగిపోయింది. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్‌పై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా బాలకృష్ణ బహిరంగంగానే ఎన్టీఆర్‌పై రుసరుసలాడారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందిచడం లేదని పదేపదే అడగ్గా ఆయన్నె అడగాలని, ఎన్టీఆర్ స్పందించకుంటే ఏమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలయ్య.

వాస్తవానికి ఎన్టీఆర్‌తో అవసరం ఉన్నప్పుడు ఆయన్ని విపరీతంగా వాడుకున్నారు చంద్రబాబు. 2009లో ఎన్టీఆర్‌కు ప్రచార బాధ్యతలను అప్పజెప్పి లబ్దిపొందారు. ఆ తర్వాత పార్టీకి ఎన్టీఆర్‌ని దూరం చేసి లోకేష్‌ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు లోకేష్‌కు చాలా తేడా ఉండటంతో లోకేష్‌తో టీడీపీకి భవిష్యత్ ఉంటుందని ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. దీంతో ఎన్టీఆర్ నీడ కూడా టీడీపీపై లేకుండా చేయడంలో సక్సెస్ సాధించి ఆనందం పొందారు. తిరిగి చంద్రబాబు కష్టాల్లో ఉన్పప్పుడు ఎన్టీఆర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేయగా జూనియర్ మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు. ఇదే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జూనియర్‌పై ఆగ్రహం తెప్పించేలా చేయగా అది బాలయ్య రూపంలో బయటపెట్టారు బాబు. ఎక్కడా తన ముసుగు తీయకుండా బాలయ్యతో విమర్శలు చేయించారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా మరోసారి బాలయ్య నోరు జారగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతుండటం తెలుగు తమ్ముళ్లను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -