Wednesday, May 8, 2024
- Advertisement -

రూ.200 కోట్ల చేరువలో హనుమాన్!

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డులను తిరగరాస్తోంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు సాధించే దిశగా దుసుకుపోతోంది.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ సినిమా, దానికి సంబంధించిన విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. తొలుత హనుమాన్‌కు తక్కువ థియేటర్లు ఇచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సినిమా విడుదలై వారం గడుస్తున్న హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి బాలయ్య వరకు సినిమా బాగుందని కితాబిచ్చారు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను అని బాలయ్య చెప్పడం విశేషం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొత్తంగా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇదే నిదర్శనం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -