Thursday, May 2, 2024
- Advertisement -

బల్మూరి వెంకట్‌కి బంపర్ ఆఫర్!

- Advertisement -

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఓ కొలిక్కి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ రెండు స్థానాలకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌కు కన్ఫామ్ కాగా రెండోస్థానం కోసం ఊహించని పేరు తెరపైకి వచ్చింది.

రెండు స్థానాలకు గాను ఒకటి దయాకర్‌ పేరు దాదాపు ఖరారు కాగా మిగిలిన స్థానం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నేతల పేర్లు వినపడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి విభాగం నేత బల్మూరి వెంకట్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

విద్యార్థి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకట్. పెద్ద ఎత్తున ఆయనపై కేసులు నమోదయ్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు వెంకట్. ఈ నేపథ్యంలోనే వెంకట్ పేరు ఎమ్మెల్సీగా ఖరారు కావడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -