Saturday, May 4, 2024
- Advertisement -

దూబేతో పాండ్యాకు చెక్‌!

- Advertisement -

టీమిండియాకు కొత్త ఆల్‌రౌండర్ దొరికాడా..?ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్న ఆ ఆటగాడు …హార్ధిక్ పాండ్యాక్ చెక్ పెట్టాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆఫ్ఘానిస్తాన్‌ టీ20 సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న శివమ్ దూబే..అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించి..పాండ్యా స్థానం తనకేనని చెప్పకనే చెప్పాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌ రాణించి సత్తాచాటాడు దూబే.

ఆప్ఘాన్‌తో సిరీస్‌లో తనకు వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకుని టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేశాడు దూబే. బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా బౌలింగ్ లో కూడా దూబే రాణిస్తుండడంతో అల్ రౌండ్ జాబితా లో హర్ధిక్ స్థానంలో చోటు కల్పించాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

గాయం కారంగా జట్టుకు దూరమయ్యాడు హార్ధిక్‌. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ కూడా హర్ధిక్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహమే. అందుకే శివమ్ దూబే పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా మరి సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -