Tuesday, April 30, 2024
- Advertisement -

విజయవాడ బరిలో భువనేశ్వరి!

- Advertisement -

బెజవాడ పాలిటిక్స్ మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు విజయవాడ రాజకీయాలు కేశినేని బ్రదర్స్ మధ్య వార్‌గా జరిగాయి. టికెట్ కోసం కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్నిగా పోరు జరుగగా చంద్రబాబు చిన్ని వైపు మొగ్గుచూపారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసిన నాని వైసీపీలో చేరారు. ఇక నానికే వైసీపీ టికెట్ కన్ఫామ్‌కాగా టీడీపీ నుండి చిన్ని పేరును అఫిషియల్‌గా ప్రకటించలేదు చంద్రబాబు.

అయితే తాజాగా విజయవాడ బరిలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. నారా భువనేశ్వరిని విజయవాడ ఎంపీ సీటు నుండి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ తరపున కేశినేని నాని వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుండి నాని పోటీ చేస్తుండగా సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా భువనేశ్వరిని బరిలోకి దింపితే కలిసివస్తుందని భావిస్తున్నారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భువనేశ్వరి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా భువనేశ్వరి పోటీ చేస్తుందన్న వార్త బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -