Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 5 ఏ నెలలో వస్తుందో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో “బిగ్ బాస్ “ప్రముఖమైనది.
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో ప్రేక్షకాదరణ పొందడంతో తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ప్రసారం చేస్తున్నారు. ప్రతి భాషలో బిగ్ బాస్ కేవలం ఒక సీజన్ కి మాత్రమే పరిమితం కాకుండా పలు సీజన్లతో దూసుకుపోతోంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని సీజన్ 5 దిశగా అడుగులు వేస్తోంది.ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ సీజన్ 5 లాంచ్ చేయాలని షో నిర్వాహకులు భావించారు. అందులో భాగంగానే షెడ్యూల్ ప్రకారం జూన్ నెలలో సీజన్ 5 ప్రారంభిస్తున్నామని షో నిర్వాహకులు చెప్పడంతో బిగ్ బాస్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.

Also read:13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

తాజాగా బిగ్ బాస్ షో ఆగస్టు నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ షో వాయిదా పడడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ అని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రావాల్సిన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ ను వాయిదా వేయడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -