Sunday, April 28, 2024
- Advertisement -

గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరో తెలుసా!

- Advertisement -

తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాటీల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడు ఇక్కడ మేయర్‌, చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల7వ తేదీ శుక్రవారం ఈ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలోనే మేయర్ అభ్యర్థులపై సీఎం కేసిఆర్ కసరత్తు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల ఇంచార్జులకు పంపించారు. వీరి పేర్లను సీల్డు కవర్‌లో ఎన్నికల ఇంచార్జులుగా నేతలకు ఇప్పటికే అందించనున్నారు. అయితే కౌన్సిల్ సమావేశంలో వారిని అధికారికంగా ప్రకటించనున్నారు.

వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గాపులుకొల్లు నీరజ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక సిద్దిపేట మున్సిపాలిటీకి కడదర్ల మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్‌ ల పేర్లను సీఎం ఖారారు చేశారు. గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​ మేయర్​గా గుండు సుధారాణి నియమితులయ్యారు.

మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, గంగుల, ఎర్రబెల్లి దయాకర్​రావు సమక్షంలో హోటల్​ హరితకాకతీయ కాన్ఫరెన్స్​ హాలులో జరిగిన కార్యక్రమంలో సుధారాణిని మేయర్​గా ప్రకటించారు. గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్​గా 36వ డివిజన్​ కార్పొరేటర్​ రిజ్వానా షమీమ్​ మసూద్​ ఎంపికయ్యారు. కాగా, గ్రేటర్​ మేయర్​, డిప్యూటీ మేయర్​ ఇద్దరూ మహిళలే ఎంపిక కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -