Saturday, May 18, 2024
- Advertisement -

పొత్తా..ఒంటరిపోరా..బీజేపీలో కన్ఫ్యూజన్?

- Advertisement -

ఓ వైపు విమర్శలు మరోవైపు కన్ఫ్యూజన్‌…ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాష్ట్ర బీజేపీ నేతలు, ప్రధానంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండగా అటు టీడీపీ నేతల నుండి మాత్రం ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. అయితే పొత్తుపై బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం కానుంది.

అయితే తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండగా ఏపీలో మాత్రం జనసేన -టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఇక ఈ కూటమిలోకి బీజేపీని చేర్చేందుకు జనసేనాని పవన్ విశ్వప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌కు సైలెంట్‌గా మద్దతిచ్చేశారు చంద్రబాబు. ఇక ఏపీలో టీడీపీతో కలిసేందుకు ఆ పార్టీ నుండి పిలుపురాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు పవన్.

అవసరమైతే బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒక ఈ కూటమిలో చేరకపోతే భవిష్యత్ కార్యచరణ ఏంటనే దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు బీజేపీ నేతలు. ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేది కష్టమే. అలా అన్ని స్థానాల్లో పోటీ చేయడం కష్టమే. అందుకే ఏపీ బీజేపీ నేతలు టీడీపీ – జనసేనతో పొత్తుకు తహతహలాడుతున్నారు. ప్రధానంగా పురందేశ్వరి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కూటమితో పొత్తులో భాగంగా విశాఖ నుండి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాలో ఆమె ఉన్నారు. అయితే కొంతమంది బీజేపీ నేతలు మాత్రం గెలుపు ఒటముల సంగతి పక్కన పెట్టి ఒంటరి పోరే బెటరని చెబుతన్నారు. మొత్తంగా పొత్తుల విషయంలో బీజేపీ నేతలు ఫుల్ కన్ఫ్యూజన్‌లో ఉండగా త్వరలోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -