- Advertisement -

తగ్గుతున్న జననాల రేటు!

- Advertisement -

భారతదేశంలో సంతానోత్పత్తి రేటు కిందకు పడిపోయింది. ఇది కేవలం జనాభా గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని దీని వెనుక ఉన్న ప్రత్యుత్పత్తి ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న సంతానలేమి , ఆలస్యంగా పిల్లల్నిననడం, జీవనశైలి మార్పులు సంతానోత్పత్తిపై అవగాహన లోపించడం వంటివి దీనికి ముఖ్య కారణాలని ఫెర్టిలిటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారతదేశంలో సంతానోత్పత్తి స్థాయిలు పడిపోవడం దేశ భవిష్యత్తు జనాభా రూపురేఖలపై సరికొత్త చర్చకు దారితీసింది. జనాభా ధోరణులు, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ అంతే సమానంగా దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యమైన సమస్య ఉందని నిపుణులు వాదిస్తున్నారు.

ప్రత్యుత్పత్తి ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయంగా మిగిలిపోకుండా అదొక ప్రజారోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా తల్లిదండ్రులు కావడం, జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, సంతానోత్పత్తిపై సరైన అవగాహన లేకపోవడం వంటి అనేక అంశాలు భారతీయుల ఫ్యామిలీ ప్లానింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

గత దశాబ్ద కాలంతో పోలిస్తే పిల్లల కోసం ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఆశ్రయించే జంటల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంతానోత్పత్తి వయసులో ఉన్న వారిలో కింది ఆరోగ్య సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి.

()హార్మోన్ల అసమతుల్యత మరియు పీసీఓఎస్ (PCOS)

()ఊబకాయం మరియు మధుమేహం (డయాబెటిస్)

()పురుషులలో శుక్రకణాల నాణ్యత తగ్గడం

()మానసిక ఒత్తిడి, సరిపోని నిద్ర

ఇలాంటి అనేక సమస్యలు దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి చాలా సంవత్సరాల ముందే వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

చాలా మంది గుండె ఆరోగ్యం, మధుమేహం, ఫిట్‌నెస్ వంటి వాటిపై శ్రద్ధ చూపిస్తారు కానీ సంతానోత్పత్తి విషయానికి వస్తే మాత్రం సమస్యలు ఎదురైనప్పుడే దాని గురించి ఆలోచిస్తారు. ఆ సమయానికి పిల్లల్ని కనడానికి అనుకూలమైన కీలకమైన వయసు దాటిపోతోంది. మారుతున్న సంతానోత్పత్తి ధోరణులకు మరో ముఖ్యమైన కారణం.. ఆలస్యంగా వివాహం చేసుకోవడం మరియు ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకోవడం.

నేటి తరం యువత కుటుంబ నియంత్రణ కంటే ముందు తమ విద్య, కెరీర్ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా, తల్లిదండ్రులు అయ్యే సగటు వయసు పెరుగుతూ వస్తోందని ఫర్టిలీటి నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో 30 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది మరియు 35 ఏళ్ల తర్వాత అది మరింత వేగంగా క్షీణిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -