- Advertisement -

గూగుల్‌ పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు రావు!

- Advertisement -

విశాఖ వేదికగా గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థ ఏర్పాటుతో లక్ష ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండగా దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.

విశాఖలో గూగుల్ పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం తప్పు అని తెలిపారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు… విశాఖ నుంచి ఇతర దేశాలకు డేటా పంపించే వ్యవస్థ అన్నారు.

గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులతో విశాఖపట్నం పేరు ప్రపంచానికి తెలుస్తుంది… విశాఖ వైపు ఆకర్షితులై మిగిలిన ఐటీ కంపెనీలు ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి వస్తుంది అన్నారు. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని తెలిపారు.

అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విష్ణుకుమార్ రాజు. ఫ్రీ బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది..టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్సు నుంచి దించేస్తున్నారు అన్నారు. స్వయంగా ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు
… ఫ్రీ బస్సు పథకం వల్ల మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -