భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా అక్టోబర్ 19న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్టును పరిశీలిస్తే.. పెర్త్ స్టేడియంలోని పిచ్‌ను తరచుగా ఫాస్ట్ బౌలర్లకు స్వర్గం అని పిలుస్తారు.
స్టేడియంలో 6 మ్యాచ్‌లు జరుగగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఒకసారి గెలవగా ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు 5 సార్లు గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు: 172కాగా సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోరు: 171. ఇంగ్లాండ్ వర్సెస్ ఆసీస్ మధ్య గరిష్ట స్కోరు 259గా నమోదుకాగా ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య 140 తక్కువ స్కోరు నమోదైంది. దీంతో బౌలర్లకు స్వర్గధామంగా మారిన పెర్త్ పిచ్‌పై భారీ స్కోరు సాధించడం కష్టమే.
ఆస్ట్రేలియా:
మిచెల్ మార్ష్ (సి), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, బెన్ డ్వార్షిస్, నెథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హీడ్, మథ్యూ క్యూహ్నమాన్, మార్నస్ లాబూషేన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మథ్యూ రెన్షా, మథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్.
భారత్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వీసీ), అక్సర్ పటేల్, KL రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మోహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసాద్ కృష్ణ, ధృవ్ జురెల్ (WK), యశస్వి జైస్వాల్
పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, మొదటి ODIలో బౌలింగ్ తో ప్రారంభించటం, ప్రత్యర్థుల స్కోరు తగ్గించడం కీలకంగా ఉండే అవకాశం ఉంది.
