- Advertisement -

చంద్రగ్రహణం..లైవ్ స్ట్రీమింగ్!

- Advertisement -

ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది. ఆదివారం, సెప్టెంబర్ 7, 2025 రాత్రి భారత ఆకాశాన్ని అలరించనుంది. ఈ సంవత్సరం చివరి సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో ఖగోళ ప్రియులు తప్పనిసరిగా వీక్షించదగిన సంఘటనగా భావిస్తున్నారు. ఈ చంద్రగ్రహణం భారత్, ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు అమెరికాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.

దేశంలో ఉపచ్ఛాయ గ్రహణం ప్రారంభం: రాత్రి 8:59 కాగా ఆంశిక గ్రహణం ప్రారంభం: రాత్రి 9:58, సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభం: రాత్రి 11:01, గరిష్ట గ్రహణం: రాత్రి 11:42, సంపూర్ణ గ్రహణం ముగింపు: రాత్రి 12:22 (సెప్టెంబర్ 8) కానుంది.

మొత్తం 5 గంటలు 24 నిమిషాలు గ్రహణం ఉండనుండగా భారత్‌తో పాటు ఈ ప్రదేశాల్లో కూడా చంద్ర గ్రహణం పూర్తిగా లేదా కొంతవరకు కనిపిస్తుంది. తూర్పు ఆఫ్రికా,ఆస్ట్రేలియా (సిడ్నీ, మెల్‌బోర్న్), సింగపూర్, దుబాయ్, లండన్,టోక్యో,కేప్ టౌన్,యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. వాతావరణం కారణంగా నేరుగా చూడలేని వారికి లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -