- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికలు..BRS దూరం

- Advertisement -

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించాము..మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేట్ కాదు.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్ అన్నారు.

కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు అన్నారు కేటీఆర్. కవిత సస్పెన్షన్ పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. కవిత వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి అన్నారు. పార్టీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం … నిర్ణయం తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏముండదు అన్నారు.

వారం కిందట ఇదేరోజు కాళేశ్వరం మీద లేని పోనీ ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వయిరీ వేశారు..ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలించి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తున్నాడు అన్నారు కేటీఆర్. తల ఉన్నోడు ఎవరైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు…..తలా తోక తెల్వనోడే తోక దగ్గర శంకుస్థాపన చేస్తాడు… మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే రైతులు ప్రశ్నిస్తారనే అక్కడ చెయ్యట్లేదు అన్నారు.

మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికులలా పని చేసి రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు… 21 నెలల నుండి ఆ డ్రగ్స్ కంపెనీపై ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తుంది?…
మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై రైడ్స్ చేస్తుంటే.. తెలంగాణ పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు తీసుకుపోవడంలో, రీట్వీట్ కొట్టిన వారిపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు – కేటీఆర్ హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు.

హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం… రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం అన్నారు కేటీఆర్. ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం..
హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా నీళ్లు ఇచ్చేట్టు చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -