Monday, May 20, 2024
- Advertisement -

బెయిల్ వచ్చినా బాబుకు మళ్లీ జైలేనా!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 28తో బాబు మధ్యంతర గడువు ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అయితే స్కిల్ స్కాంలో బెయిల్ దొరికినా మిగితా కేసుల్లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే స్కిల్ స్కామ్ లో రెగ్యులర్ బెయిల్ లభించినప్పటికీ అమరావతి రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్ వంటివి ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా కంటి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబు..గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు బాబు తరపు లాయర్లు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే…కేసు నుండి బాబు పేరును తొలగించలేదు కాబట్టి భవిష్యత్‌లో అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -