Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నికల సంగ్రామం..ఆ 30 నియోజకవర్గాలే కీలకం!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరుకుంది. ప్రధానంగా పోటీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఉంది. ఈ రెండు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల హీట్ పెంచేశారు. ఇక ఎవరికి వారే సర్వేలు నిర్వహిస్తూ తమదంటే తమదే అధికారం అన్ని చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా నిర్ణయించేది ఆ 30 అసెంబ్లీ నియోజకవర్గాలే.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 37 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకే కీలకం. ఇందులో 7 ఎంఐఎంకు ఫిక్స్‌. ఇక మిగిలింది 30 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో ఏ పార్టీ గెలవాలన్న మైనార్టీ ఓట్లే కీలకం. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక గత ఎన్నికల్లో ముస్లిం ఓట్లు బీఆర్ఎస్‌కు అనుకూలంగా పడ్డాయి. అయితే ఈ సారి అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. నియోజకవర్గాల వారిగా ముస్లిం ఓటు బ్యాంకును పరిశీలిస్తే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నిజామాబాద్ అర్బన్ లక్ష ఓట్లు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో అజహరుద్దీన్, నిజమాబాద్ అర్బన్ లో షబ్బీర్ ఆలీకి టికెట్లిచ్చింది. అయితే జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉండటం పోరు ఆసక్తికరంగా మారింది.

ఖైరతబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 60 వేలపై ఓట్లు ఉండగా ముషీరాబాద్, మహబూబ్ నగర్, బోధన్, జహీరాబాద్, గోషామహల్లో 50 వేల ఓట్లున్నాయి. ఇందులో ఒక గోషామహల్ తప్ప మిగితావన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. గత ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 26 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. అయితే ఈ సారి ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారిదే అధికారం కావడంతో ముస్లిం ఓటర్లు ఎటువైపు నిలబడతారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -