Saturday, May 4, 2024
- Advertisement -

17లో గెలిచేది 6గురేనా..ఆ మంత్రులకు ఓటమేనా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు ఇరు పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే సర్వే రిపోర్టుల ప్రకారం సీఎం కేసీఆర్ కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులకు పరాభవం తప్పదని తెలుస్తోంది.

కేసీఆర్ కేబినెట్‌లో 17 మంత్రులు ఉండగా ఇందులో 11 మంది ఓటమి పాలుకావడం ఖాయమని తెలుస్తోంది. కేటీఆర్,హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి గెలిచే వారిలో ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేస్తుండగా కామారెడ్డిలో గెలుస్తుండగా గజ్వేల్‌లో మాత్రం ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి.

సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రి జగదీష్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,సబితా ఇంద్రారెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పరాభవం తప్పదని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికల ప్రచారానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థుల కంటిమీద కునుకు ఉండటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -