ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఈసారి వైసీపీనే గెలుస్తుందని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇక ఇప్పటికే రెండోసారి అధికారానికి ఒకడుగు దూరంలో ఉన్న జగన్..సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబుతో ఆపాటు ఆయన దత్తపుత్రుడు పవన్, బీజేపీ నేతల వైఖరిని ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరో వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇచ్చిన కౌంటర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
రోజురోజుకు జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి భయ పడి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్న చంద్రబాబు ప్రత్యక్షంగా జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బిజెపికి కూడా వారికి కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి జతకట్టాలని చంద్రబాబు రాయ”బేరాలు” సాగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారుజ దీనికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, పచ్చ మీడియా ,ఇతర పార్టీల నాయకులతో లోపాయి కారీగా ఒప్పందం చేసుకుని వైసిపి పార్టీని ఓడించటానికి చంద్రబాబు దూతల ద్వారా రహస్య సమాలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు నెటిజన్లు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు..ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత నీచ రాజకీయం చేయాలా అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరైనా ఎస్సి లుగా పుట్టాలని కోరుకుంటారా… అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తులేదా దీనిపై ఏమంటారు అని నక్క ఆనందబాబును నిలదీస్తున్నారు.
