టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన స్వగ్రామం పట్ల ఉన్న అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఊరుతో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి నా ఊరు, నా ప్రజల ఆశీర్వాదం కారణం అని తెలిపారు.
తన గ్రామ అభివృద్ధి కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన అన్నారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు. పేద కుటుంబాల పిల్లలు చదువులో ముందుకు రావాలని, వారికి ఆర్థికంగా సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
“ఊరిలో ఇల్లు కట్టుకోవడం, అదే సమయంలో పెళ్లి జరగడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన విషయం. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది,” అని భావోద్వేగంగా చెప్పారు. గ్రామంతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన సేవా కార్యక్రమాలను అభినందిస్తున్నారు.
